HomeTop StoriesCrop Holiday: క్రాప్‌ హాలీడే ప్రకటించిన కోనసీమ రైతులు

Crop Holiday: క్రాప్‌ హాలీడే ప్రకటించిన కోనసీమ రైతులు

Konaseema farmers: ఎంతో కష్టపడి పండించుకున్న పంట చేతికి వస్తున్న దశలో ప్రకృతి వైపరీత్యాల బారినపడి పంట నాశనం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికంతటికి మురుగు కాలువల ఆక్రమణ, విచ్చలవిడిగా ఆక్వా వ్యర్ధాలు పంట కాలువల్లోనూ వదులుతుండటం కారణమని రైతులు పేర్కొంటున్నారు. జులై నెలాఖరు వరకు సరిగా సాగునీరు అందని పరిస్థితి ఉందని చెబుతున్నారు.

- Advertisement -

రైతులు క్రాప్‌ హాలీడే…

ఇలా అనేక కారణాలు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాయని, ఈ క్రమంలోనే సాగు చేయలేమంటూ అల్లవరం మండలం తాడికోన గ్రామంలో వరి రైతులు క్రాప్‌ హాలీడే ప్రకటించారు. ఊడ్చని చేలు వద్ద పంట విరామం ప్రకటిస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే తాడికోన గ్రామంలో ఎవ్వరు ఊడ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు.

డ్రైయిన్ల ఆక్రమణపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో చిన్నపాటి వర్షాలకు పంటపొలాలు ముంపునకు గురై పంటలు నాశనం అవుతుందని చెప్పుకోస్తున్నారు.పెట్టిన పెట్టుబడులు రాకపోగా అప్పులు మిగిలుతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంట విరామం ప్రకటిస్తున్నట్లు తాడికోన రైతులు చెప్పారు.

Also Read:UFC Fighter: క్రీడా ప్రపంచానికి తీరని లోటు..34 ఏళ్లకే కన్నుమూసిన ప్లేయర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News