Saturday, November 15, 2025
HomeTop StoriesKonda Surekha: నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ సంచ‌ల‌న ట్వీట్ !

Konda Surekha: నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ సంచ‌ల‌న ట్వీట్ !

Konda Surekha tweet on Nagarjuna family: అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ సోషల్‌ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు. గతంలోనే సమంత ఇష్యూను తీసుకువచ్చి నాగార్జున ఫ్యామిలీపై హాట్ కామెంట్స్ చేసిన కొండా సురేఖ మరోసారి స్పందించారు. అర్ధరాత్రి కొండా సురేఖ చేసిన సంచలన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.

- Advertisement -

అక్కినేని ఫ్యామిలీపై వ్యాఖ్యలు: గతంలో అక్కినేని ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. గతంలో నాగార్జున, ఆయన ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు కొండా సురేఖ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. నాగార్జున ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకు అస్సలు లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అధిష్ఠానం ఆదేశాల మేరకే!: త‌న వ్యాఖ్య‌ల‌తో వారు బాధపడి ఉంటే.. అందుకు తాను చింతిస్తున్నట్లు ట్వీట్‌లో కొండా సురేఖ పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయం దాటిన తర్వాత కొండా సురేఖ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే కొండా సురేఖ ఇలా ట్వీట్‌ చేసి ఉంటుందని రాజకీయ, సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటికే కొండా సురేఖపై అక్కినేని నాగార్జున పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే. మ‌రి కొండా సురేఖ తాజాగా చేసిన ట్వీట్‌తో ఈ అంశానికి తెర‌ప‌డుతుందా.. లేదో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad