HomeTop StoriesDispute : చుక్క నీటి కోసం.. కృష్ణా జలాలపై వీడని ప్రతిష్టంభన

Dispute : చుక్క నీటి కోసం.. కృష్ణా జలాలపై వీడని ప్రతిష్టంభన

Krishna water sharing dispute : కృష్ణా బేసిన్‌లో నీటి కేటాయింపులకై తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ప్రవాహ పోరు మళ్లీ మొదటికొచ్చింది. ‘ఎవరి నీరు ఎంత? ఎవరి వాటా ఎంత?’ అనే ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం.. మరోమారు వాడీవేడి వాదనల మధ్య ఎలాంటి నిర్ణయం లేకుండానే ముగిసింది.

- Advertisement -

సమావేశ వేదిక: హైదరాబాద్‌లోని జలసౌధలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ కాంబోజు అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి హాజరయ్యారు.

తెలంగాణ వాదన: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేసింది. పాత 66:34 నిష్పత్తిని పక్కనపెట్టి, 50:50 లెక్కన నీటిని పంచుతూ.. తమ రాష్ట్ర అవసరాలరీత్యా 200 టీఎంసీలు కేటాయించాలని కోరింది. ఏపీ నిబంధనలకు విరుద్ధంగా పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా అదనపు నీటిని తరలిస్తోందని అభ్యంతరం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ వాదన: ఏపీ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. గత మూడేళ్లుగా అమలవుతున్న 66:34 నిష్పత్తి ప్రకారమే ఉత్తర్వులు ఇవ్వాలని, వచ్చే ఆగస్టు వరకు తమ తాగునీటి అవసరాలకోసం 104 టీఎంసీలు కావాలని పట్టుబట్టింది. తెలంగాణ కోరుతున్న 200 టీఎంసీల ప్రతిపాదన సహేతుకం కాదని, అవసరం లేకపోయినా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని మండిపడింది.
ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ వివాదాన్ని సెప్టెంబర్ నాలుగో వారంలో జరిగే కేఆర్ఎంబీ పూర్తి స్థాయి సమావేశానికి బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News