KTR Calls Prabhas: రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్..ఇప్పుడు చిన్న పిల్లలతో కలిసి ఓ షోని నిర్వహించారు.అందులోని పిల్లలు ఇచ్చిన ఓ ఛాలెంజ్ కి కేటీఆర్ తో పాటు అందరూ అవాక్కయ్యారు.అసలేం జరిగిందంటే…
కేటీఆర్ తాజాగా ‘ది అండర్ 18 వరల్డ్’ అనే యూత్ టాక్ షో లో పాల్గొన్నారు. అక్కడున్న పిల్లలు కేటీఆర్‌కు ఓ ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరారు. మీ పర్సనల్ ఫోన్ నంబర్ నుంచి ఎవరైనా స్టార్ హీరోకు కాల్ చేయాలని చెప్పారు. దీంతో కేటీఆర్ ప్రభాస్‌కు ఫోన్ చేశారు. డార్లింగ్ ఫోన్ ఎత్తగానే… వెంటనే పక్కనున్న పాప కేటీఆర్ చేతిలో నుంచి ఫోన్ ఒక్కసారిగా అందుకుని ‘సార్ నేను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఈ ఫోన్ దొరికింది. ఇందులో మీ నెంబర్ ఉంది. ఇంతకీ నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా.’ అంటూ ప్రశ్నలు వేసింది
దీంతో పక్కనే ఉన్న కేటీఆర్ ఒక్కసారిగా అవాక్కై తల పట్టుకున్నారు. అవతల ప్రభాస్‍కు ఏమీ మాట్లాడాలో అర్థం కాక వెంటనే కాల్ కట్ చేశారు. దీంతో అక్కడ కాసేపు నవ్వులు పూయగా… ‘అలా చేయకూడదు’ అంటూ కేటీఆర్ పిల్లలకు చెప్పి మళ్లీ ప్రభాస్‌కు కాల్ చేసి అసలు విషయం చెప్పారు.
‘తాను ది అండర్ 18 వరల్డ్ పాడ్ కాస్ట్ షోలో ఉన్నానని… పిల్లల కోరిక మేరకు సరదాగా కాల్ చేశాను.’ అంటూ విషయాన్ని చెప్పారు. ఇది విన్న ప్రభాస్ కాసేపు సరదాగా ఆయనతో మాట్లాడారు. త్వరలోనే తాను కూడా పిల్లలను కలుస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

