KTR Sensational comments: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) అధికారులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి వెళ్లిన అధికారులు.. అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీసులను ఇంటి గోడకు అంటించారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణ నిమిత్తం తన నివాసంలో అందుబాటులో ఉండాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్!: ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరేంది రేవంత్ రెడ్డి? అని కేటీఆర్ ప్రశ్నించారు. స్వయంగా కేసీఆరే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమని అన్నారు.
తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ?
స్వయంగా కేసీఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక… pic.twitter.com/FnueIfZ3Uo
— KTR (@KTRBRS) January 31, 2026
ఇది అహంకారం కాకపోతే మరేమిటి?: 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్‌ను సైతం పోలీసులు అతిక్రమిస్తున్నారని మండిపడ్డారు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. అధికార పక్షానికి కీలుబొమ్మల్లా ఇంటూ ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే మీ పనా? అని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read-Telangana: హార్వర్డ్ శిక్షణ విజయవంతం.. నేడు రాష్ట్రానికి సీఎం రేవంత్
ప్రజాక్షేత్రంలోనే బుద్ధిచెబుతాం: చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు.. కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నదని కేటీఆర్ అన్నారు. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తామని తెలిపారు. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోనే బుద్ధిచెబుతామని కేటీఆర్ అన్నారు.

