HomeTop StoriesKTR: గోడల మీదా సున్నాలేసుకొని బతికినోడివి..రేవంత్‌ పై ఫైర్‌ అయిన కేటీఆర్‌

KTR: గోడల మీదా సున్నాలేసుకొని బతికినోడివి..రేవంత్‌ పై ఫైర్‌ అయిన కేటీఆర్‌

KTR VS Revanth: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని, ముఖ్యంగా యువతను జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నట్టేట్లో ముంచారని కేటీఆర్‌ ఆరోపించారు.జాబ్‌ క్యాలెండర్‌ కి దిక్కులేకపోవడంతో యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎవరూ అధైర్య పడొద్దని కేటీఆర్‌ అన్నారు. ” ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం.

- Advertisement -

నకల్ కొట్టి పాసైన..

కాంగ్రెస్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమైంది?డిప్యూటీ సీఎం ఇలాకాలో యువకుడు లేఖ రాసి ఆత్మహత్యయత్నం చేశాడు. కాంగ్రెస్ హామీ ఏమైందని యువకుడు ప్రశ్నించాడు. పిల్లలు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలంగాణకు రేవంత్ అనే సన్నాసిని సీఎంగా పెట్టడమే క్రిమినల్ వేస్ట్. రేవంత్ ఏం చదివిండో డౌటే. నకల్ కొట్టి పాసైన బాపతే అయ్యింటుంది.” అని ఎద్దేవా చేశారు.

గోడలకు సున్నాలు వేసుకొని..

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోడలకు సున్నాలు వేసుకొని బతికేటోడివి అంటూ హేళనగా మాట్లాడారు. కనీసం ఎలక్షన్‌ ఫామ్‌ కూడా నింపడం రాలేదని ఎద్దేవా చేశారు. జీవితంలో ఇంటర్వ్యూకైనా హాజరైనావా అని ప్రశ్నించారు. ” మిస్టర్ రేవంత్.. నీ ఎలక్షన్ ఫామ్ నింపుగలుగుతవా? నీ జీవితంలో ఒక్క పోటీ పరీక్ష రాసినవా? ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకు హాజరైనవా? మేం కష్టపడి చదివినం.. గొప్పగొప్ప యూనివర్సిటీల్లో చదివినం. గోడల మీద సున్నాలేసుకొని బతికినోడివి నువ్వు. నీకే అంతుంటే.. ఇంజనీర్లకు ఎంతుండాలి? అంటూ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు.

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News