HomeTop StoriesKTR: నేడు చంచల్‌గూడ జైలుకు కేటీఆర్‌.. ఎందుకంటే?

KTR: నేడు చంచల్‌గూడ జైలుకు కేటీఆర్‌.. ఎందుకంటే?

Chanchalguda jail: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్నారు. ఇటీవల అరెస్ట్ అయి.. జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు.

- Advertisement -

బాల్క సుమన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు: ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలని, మిలిటెంట్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగి.. తెలంగాణ భవన్ వద్ద బాల్క సుమన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కఠిన సెక్షన్ల కింద కేసులు: బాల్క సుమన్‌పై పోలీసులు పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ (BNS)లోని 326 (G), 55, 61 (2), 351 (3), 353 (1), 152 సెక్షన్ల కింద అరెస్ట్‌ చేశారు వీటికి తోడు ప్రజా ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టం (PDPP Act) కింద కూడా కేసు ఫైల్ చేశారు.

రాజకీయ దుమారం: సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. సుమన్ చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఆయన అంగీకరించినప్పటికీ.. సుమన్ ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని అన్నారు. కేవలం భావోద్వేగంతో అన్న మాటలని కేటీఆర్ సమర్థించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News