Annaram Barrage: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన అన్నారం బ్యారేజీ ఉనికిని ప్రమాదంలోకి నెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బ్యారేజీ కింద భారీగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న వీడియోను ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేయండం కేవలం దోపిడీయే కాదు.. అతిపెద్ద నేరమని కేటీఆర్ అభివర్ణించారు.
నిబంధనల ఉల్లంఘన: బ్యారేజీ పరిసరాల్లో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న కనీస నియమాలను పక్కన పెట్టి.. పిల్లర్ల వద్దే తవ్వకాలు జరపడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. దీనివల్ల బ్యారేజీ పునాదులు బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మేడిగడ్డపై కుట్రలు చేసింది చాలదన్నట్టుగా.. ఇప్పుడు అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారా అని రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించారు.
మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ??
నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం.
బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్… pic.twitter.com/TvCYPMcn2M
— KTR (@KTRBRS) March 2, 2026
అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో: తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా పట్టపగలే నిస్సిగ్గుగా ఇసుకను తోడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో అన్నట్లుగా తెలంగాణ వనరులను కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని కేటీఆర్ అన్నారు.
Also read-Kalvakuntla kavitha: “రాహుల్ జీ.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?”
మీ భరతం పట్టే రోజు దగ్గర్లోనే: నిబంధనలు బ్రేక్ చేసిన ఇసుక మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యారేజీని బలహీనపరిచే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు మీ భరతం పట్టే రోజు దగ్గర్లోనే ఉంది.. ఖబడ్దార్! అని సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ హెచ్చరించారు.

