HomeTop StoriesLok Sabha: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు చర్చకు లైన్ క్లియర్.. రేపు ఓటింగ్‌!

Lok Sabha: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు చర్చకు లైన్ క్లియర్.. రేపు ఓటింగ్‌!

Constitutional Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు చారిత్రాత్మక బిల్లులు వచ్చాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపు కోసం డీలిమిటేషన్‌ బిల్లు.. అలాగే పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. లోక్‌సభ (Lok Sabha) ప్రారంభమైన తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లులను ప్రతిపాదించారు. దీంతో ఈ బిల్లులను విపక్షాలు వ్యతిరేకించాయి. అంతే కాకుండా డివిజన్‌ ఓటింగ్‌కు పట్టుబట్టాయి. అందుకు స్పీకర్‌ ఓం బిర్లా సమ్మతించారు.

- Advertisement -

విపక్షాలకు చుక్కెదురు: లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లైన్ క్లియర్ అయ్యింది. డివిజన్‌ ఓటింగ్‌ నిర్వహించగా.. బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 207 ఓట్లు పోలయ్యాయి. 126 మంది దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. దీంతో ఈ బిల్లులపై నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్‌లో చర్చించనున్నారు. ఈ మూడింటిపై ఒక్కో సభలో 18 గంటలపాటు ఎంపీలు మాట్లాడుతారు. ప్రధాని మోదీ సాయంత్రం లోక్‌సభలో ప్రసంగిస్తారు.

ఏప్రిల్‌ 17న ఓటింగ్‌: చర్చ అనంతరం ఈ మూడు బిల్లులపై ఏప్రిల్‌ 17న సాయంత్రం 4 గంటలకు ఓటింగ్‌ జరుగుతుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. ఓటింగ్‌కు ముందు బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుందని తెలిపారు. అన్ని పార్టీలకు చర్చలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News