Assembly election results Live updates: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు దాదాపు పూర్తి అయ్యింది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షం, మరికొన్ని చోట్ల ప్రతిపక్షాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
ఫలితాల వేళ.. మమతా బెనర్జీ వీడియో మెసేజ్
- ఇప్పటివరకు మూడు రౌండ్ల లెక్కింపే జరిగిందన్న దీదీ
- తుది ఫలితాలు మారుతాయ్ అంటూ ధీమా వ్యక్తం
- సర్ పేరుతో భాజపా ఓట్లు దొంగలించిందని ఆరోపించిన మమతా బెనర్జీ
అభిమానులందరూ విజయ్‌కే ఓటు వేశారు: డీఎంకే నేత సోము
- విజయ్‌కు అభిమానులు భారీగ మద్దతు పలికారు.
- విజయ్ అభిమానగణం మొత్తం టీవీకేకు ఓటు వేశారు
- సినిమాల నుంచి వచ్చిన వారిని ఆదరించడం తమిళనాడుకు కొత్తకాదు.
వెనుకంజలో సీఎం స్టాలిన్.. బోరున విలపించిన డీఎంకే కార్యకర్తలు
- తాజా ఫలితాల్లో సినీ నటుడు విజయ్ టీవీకే దూసుకుపోతోంది.
- ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో డీఎంకే కార్యాలయం చిన్నబోయింది
- సంబరాల కోసం వేసిన టెంట్లను డీఎంకే కార్యకర్తలు ఇప్పటికే తొలగించారు.
సెంచరీ కొట్టిన విజయ్ పార్టీ..
- తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం
- సత్తా చాటుతున్న టీవీకే అధ్యక్షుడు విజయ్
- డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య హోరా హోరీ పోరు కనపడుతోంది
- పెరంబూర్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో విజయ్ ముందంజ
బెంగాల్ ఆధిక్యంలో మమతా బెనర్జీ…
- పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి.
- భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ
- ఆధిక్యంలో కొనసాగుతున్న మమత
తమిళనాడులో విజయ్ ముందంజ…
- తమిళనాడు పోస్టల్ బ్యాలెట్లలో డీఎంకే ముందంజ.
- పెరంబూర్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో విజయ్ ముందంజ
- ఆధిక్యంలో కొనసాగుతున్న సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్
- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో ఆధిక్యంలో విజయ్

