Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ రైతు.. గొడ్డలితో తన జననాంగాన్ని నరుక్కుని బావిలో పడేసాడు. మహారాజ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఈ దారుణం జరిగింది. కుటుంబ ఆర్థిక భారాలు, మానసిక వేదనే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఘటనకు దారితీసిన పరిస్థితులు: సదరు రైతుకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని భార్య గత కొంతకాలంగా పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. దీనికి తోడు జూన్ 25న పెద్ద కుమార్తె వివాహం నిశ్చయమైంది. ఒకపక్క అనారోగ్యంతో ఉన్న భార్య, మరోపక్క కూతురి పెళ్లి ఖర్చులు.. వీటన్నింటికీ తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా మారడంతో ఆ రైతు కొద్దిరోజులుగా తీవ్ర మానసిక వేదనతో సతమతమవుతున్నాడు.
‘బాబా’గా మారాలనే ఉద్దేశంతోనే: ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా మారడంతో కుటుంబ బాధ్యతల నుంచి విముక్తి పొంది, పాపభీతిని వీడి ఒక బాబా(సాధువు)గా మారాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన శరీర భాగాన్ని తొలగించుకోవాలని భావించాడు. శనివారం ఉదయం పొలంలోని బావి వద్దకు చేరుకుని గొడ్డలితో జననాంగాన్ని నరుక్కోని బావిలో విసిరేశాడు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావం జరుగుతున్న స్థితిలోనే తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కంగుతిన్న కుటుంబ సభ్యులు వెంటనే పొలానికి చేరుకుని.. రక్తపు మడుగులో పడివున్న అతడిని ఛతర్‌పుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Also read-Viral: చీర నచ్చలేదని పెళ్లిని రద్దు చేసిన వధువు!
పరిస్థితి విషమం: ప్రస్తుతం ఆసుపత్రిలో అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రైతుకు తీవ్రంగా రక్తస్రావం జరగడంతో చికిత్స కొనసాగిస్తున్నామని జిల్లా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మనోజ్ చౌధరి తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహారాజ్‌పుర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

