HomeTop StoriesNagarjuna Sagar: నేడు సాగర్‌లో మహా వరుణ యాగం.. కుటుంబ సమేతంగా హాజరుకానున్న సీఎం

Nagarjuna Sagar: నేడు సాగర్‌లో మహా వరుణ యాగం.. కుటుంబ సమేతంగా హాజరుకానున్న సీఎం

Maha Varuna Yagam: రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు, చెరువులు జలకళతో కళకళలాడాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా మహా వరుణ యాగం నిర్వహించనున్నారు. వాతావరణంపై ఎల్‌నీనో ప్రభావం తొలగిపోయి రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకను చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు.

- Advertisement -

పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గననున్న సీఎం: నాగార్జునసాగర్‌లోని విజయ్‌ విహార్‌ ఆవరణలో ఈ మహా వరుణ యాగం జరుగనుంది. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు 11 ప్రత్యేక హోమగుండాలతో ఈ యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహా వరుణ యాగానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3:24 గంటలకు నిర్వహించే యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎంతో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Also Read-DSC allegations: డీఎస్సీ ఆరోపణలతో వేడెక్కిన రాజకీయం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News