HomeTop StoriesMahanadu: అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు

Mahanadu: అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు

Mahanadu: తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగైన మహానాడు ఏపీలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీల ముఖ్య నేతలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

- Advertisement -

డిజిటల్ బాటలో పసుపు పండుగ: ఈ ఏడాది మహానాడును పార్టీ సరికొత్తగా హైబ్రిడ్‌ విధానంలో నిర్వహిస్తోంది. సాంకేతికతను జోడించి నిర్వహిస్తున్న ఈ వేడుకను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్ల నుండి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. మంగళగిరి కేంద్ర కార్యాలయం నుండి సాగే ముఖ్య నాయకుల ప్రసంగాలను, తీర్మానాలను.. 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు నేరుగా ఆన్‌లైన్ ద్వారా వీక్షించేందుకు వీలుగా ఏర్పట్లు చేశారు. క్షేత్రస్థాయి కార్యకర్తలను సైతం డిజిటల్ పద్ధతిలో అనుసంధానం చేస్తూ నిర్వహిస్తున్న ఈ హైబ్రిడ్ మహానాడుపై తమ్ముళ్లలో భారీ ఉత్సాహం కనిపిస్తోంది.

మోడల్ మారిందే తప్ప.. ఆశయం మారలేదు: వర్చువల్ మహానాడు కారణంగా రోడ్లపై వాహనాల హోరు తగ్గిందేమో కానీ.. కార్యకర్తల్లో పొంగుతున్న జోరు మాత్రం అస్సలు తగ్గలేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి హైబ్రిడ్ విధానంలో ప్రారంభమైన మహానాడు ప్రతినిధుల సభలో ఆయన ప్రసంగం చేశారు. సాంకేతిక విప్లవం వల్లే నేడు అన్ని క్లస్టర్లను అనుసంధానిస్తూ హైబ్రిడ్ మహానాడును నిర్వహిస్తున్నామని అన్నారు. ఇక్కడ మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు ఆశయాల విధానం మారలేదని ఆయన పేర్కొన్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవం: సమాజంలో పేదలకు కూడు, గూడు, నీడ కల్పించాలనే సంక్షేమ విధానాలతోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతి పుట్టుకకు, విజన్ పాలిటిక్స్‌కు రూపం టీడీపీ అని తెలిపారు. దేశానికి జాతీయ జెండా ఎంత గౌరవమో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి పసుపు జెండా అంత గౌరవమని పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు పార్టీపై ప్రజల్లో ఉన్న ఆదరణ చెక్కుచెదరలేదని అన్నారు. “జైలు పాలైనా వెనకడుగు వేయలేదు: నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు.. లోకేశ్‌ యువగళం పాదయాత్రను అడ్డుకున్నారు. ఎందరో నేతల్ని అరెస్టు చేశారు. అయినా ప్రజాస్వామ్యం కోసం వెనకడుగు వేయలేదు” అని చంద్రబాబు అన్నారు.

మహిళలకు పెద్దపీట: మహిళా సాధికారిత కోసం, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ గౌరవం కోసం టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని చంద్రబాబు తెలిపారు. నాడు ఎన్టీఆర్ ఇచ్చిన ఆస్తి హక్కు నుంచి.. నేటి తల్లికి వందనం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు.. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు తెలుగుదేశం పార్టీ మహిళల వెనుక ఉండి పోరాడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News