Fire accident:గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.’బర్చ్ బై రోమియో లేన్’ అనే నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందారు.
గోవాలోని నార్త్ గోవా జిల్లాలోని అర్పోరా గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ‘బర్చ్ బై రోమియో లేన్’ అనే నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 25 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు పర్యాటకులు ఉండగా.. మిగతావారు క్లబ్ సిబ్బందిగా గుర్తించబడ్డారు. మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు కిచెన్ సిబ్బందిగా అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనం కాగా.. మిగిలిన 20 మంది ఊపిరాడక మరణించారని స్థానిక పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్ రాజధాని పనాజీకి సుమారు 25 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్లబ్‌ను గతేడాది ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read:https://teluguprabha.net/top-stories/young-woman-suicide-after-love-failed-in-siddipet-district/
సీఎం దిగ్భ్రాంతి.. దర్యాప్తు ఆదేశం: అగ్ని ప్రమాదంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర ఘటన అని పేర్కొంటూ.. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబోతో కలిసి సీఎం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.ప్రమాదంపై దర్యాప్తు చేస్తామని అన్నారు.నైట్ క్లబ్‌లో భద్రతా చర్యలు పాటించలేదని తమకు ప్రాథమికంగా తెలిసిందని తెలిపారు. విచారణలో భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అంతేకాకుండా ఈ క్లబ్‌కు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తనిఖీలకు ఆదేశం: సిలిండర్ పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు.ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్ క్లబ్‌లపై తనిఖీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. అనుమతులు లేని క్లబ్‌ల లైసెన్స్‌లను రద్దుచేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

