Friday, February 13, 2026
HomeTop StoriesKakinada: పండుగ పూట పగబట్టిన విధి.. ఊరంతా కాలి బూడిదైంది

Kakinada: పండుగ పూట పగబట్టిన విధి.. ఊరంతా కాలి బూడిదైంది

Major fire accident: సంక్రాంతి పండుగ వేళ ఆ గిరిజన గూడెంలో తీరని విషాదం నెలకొంది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లె తండాలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఆ ఊరి ఉనికినే దహించివేసింది. క్షణాల్లో దావానలంలా వ్యాపించిన అగ్ని కీలలు 38 పూరిళ్లను బూడిద చేశాయి. మూడు ఇళ్లు మినహా ఊరంతా అగ్నికి ఆహుతై శ్మశానాన్ని తలపిస్తోంది.

- Advertisement -

పండుగ పూట పగబట్టిన విధి: అడవిని నమ్ముకుని జీవించే గిరిజనులు.. సంక్రాంతి పండుగ సరుకుల కొనుగోలు కోసం సోమవారం సాయంత్రం సమీపంలోని తుని పట్టణానికి వెళ్లారు. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ ఇళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఊర్లో ఉన్న కొద్దిమంది ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. విషయం తెలిసి గ్రామస్తులు తుని నుంచి తిరిగొచ్చేసరికి వారి కలల గూడు, కష్టార్జితం అంతా బూడిద కుప్పగా మారింది.

Also read-Sankranti: సంక్రాంతి వేళ మీ ప్రయాణం సాఫీగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

మిన్నంటిన బాధితుల రోదనలు: మారుమూల మన్యం ప్రాంతం కావడం, అగ్నిమాపక కేంద్రం ఉన్న తుని పట్టణం దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో సహాయక చర్యలు అందడంలో జాప్యం జరిగింది. ఫైర్ ఇంజిన్ వచ్చే సమయానికే సర్వం కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో మిగిలిపోయారు. ఒకరినొకరు ఓదార్చుకోలేని స్థితిలో బాధితుల రోదనలు మిన్నంటాయి.

రంగంలోకి ఎమ్మెల్యే సత్యప్రభ: ప్రమాద వార్త తెలియగానే ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ వెంటనే సార్లంకపల్లెకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులకు ఆహారం, వసతి కల్పించాలని అధికారులను ఆదేశించి క్షేత్రస్థాయిలో సమన్వయం చేశారు.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News