Road accident: రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. మిర్జాగూడ సమీపంలో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
చెట్టును బలంగా ఢీకొట్టిన కారు: విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు మోకిల నుంచి హైదరాబాద్ వైపు వస్తుండగా.. మిర్జాగూడ వద్ద ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. మరణించిన వారు హైదరగాబాద్‌లోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.
Also read-Ap: మైనర్లతో అసభ్య కంటెంట్..య్యూటుబర్ అరెస్ట్!
ఘటనా స్థలంలో విషాదఛాయలు: రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో మరియు విద్యాసంస్థల్లో తీవ్ర విషాదం నెలకొంది. అతివేగం ప్రాణాలకు ప్రమాదమని పోలీసులు మరోసారి హెచ్చరించారు.
మృతుల వివరాలు:
- సూర్యతేజ(20)- ఐసీఎఫ్‌ఏఐ (ICFAI) వర్సిటీ విద్యార్థి.
- సుమిత్(20)-ఐసీఎఫ్‌ఏఐ (ICFAI) వర్సిటీ విద్యార్థి.
- శ్రీనిఖిల్(20)- ఐసీఎఫ్‌ఏఐ (ICFAI) వర్సిటీ విద్యార్థి.
- రోహిత్(18)-ఎంజీఐటీ (MGIT) కళాశాలలో విద్యార్థి.

