HomeTop StoriesMamata Banerjee: వెళ్లాలనుకునే వాళ్లు వెళ్లిపోండి.. పార్టీని కొత్తగా మళ్లీ నిర్మిస్తా.. దీదీ సంచలన వ్యాఖ్యలు

Mamata Banerjee: వెళ్లాలనుకునే వాళ్లు వెళ్లిపోండి.. పార్టీని కొత్తగా మళ్లీ నిర్మిస్తా.. దీదీ సంచలన వ్యాఖ్యలు

Mamata Banerjee Comments: పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే, ఓటమి అనంతరం ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో అసమ్మతి రాజుకుంది. కొంతమంది మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. వారి వల్లే ఓడిపోయిందంటూ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కాళీఘాట్‌లోని తన నివాసంలో శనివారం మమతా బెనర్జీ నిర్వహించిన పార్టీ అంతర్ఘత సమావేశంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉండాలనుకునేవాళ్లు ఉండొచ్చని, వద్దనుకునేవాళ్లు వెళ్లిపోవచ్చని నిర్మొహమాటంగా చెప్పినట్లు టీఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయనే ఊహాగానాలు వెలువడుతోన్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Also Read: Upendra Dwivedi: మళ్లీ అలా చేస్తే వరల్డ్‌ మ్యాప్‌లో కనిపించరు.. పాకిస్థాన్‌కి భారత ఆర్మీ చీఫ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

దెబ్బతిన్న పార్టీ ఆఫీసులకు రంగులేయండి..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘పార్టీ మారాలనుకునే వారిని వెళ్లనివ్వండి. నేను పార్టీని కొత్తగా మళ్లీ నిర్మిస్తాను. ఇందులోనే ఉండేవారు.. దెబ్బతిన్న పార్టీ కార్యాలయాలను పునర్నిర్మించండి. వాటికి రంగులు వేయండి. అవసరమైతే నేనూ రంగులు వేస్తాను. టీఎంసీ ఎప్పటికీ, ఎవ్వరికీ తల వంచదు. ప్రజల తీర్పును బీజేపీ దొంగిలించింది.’ అని దీదీ వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Also Read: Kavitha: బండి సంజయ్‌ని వెంటనే బర్తరఫ్‌ చేయాలి.. పీఎం మోదీకి కవిత సంచలన లేఖ

ఓటమి తర్వాత వెళ్తారని ముందే గ్రహించా..

ఆ తర్వాత టీఎంసీ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు పోస్ట్‌ చేసింది. దీనికి ‘టీఎంసీ ఒక కుటుంబంలా ఐక్యంగా నిలుస్తుంది అనే క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రజల తీర్పును దోచుకునే వారి ముందు మేం ఎప్పటికీ తలవంచం. సత్యమే గెలుస్తుంది’ అని రాసుకొచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓటమి అనంతరం చాలామంది ఇతర పార్టీలకు వెళ్తారని తాను ముందే గ్రహించినట్లు చెప్పారు. అందుకు వారికి సొంత కారణాలు ఉండొచ్చని.. వెళ్లాలనుకునే వారిని తాను ఆపాలనుకోవడం లేదని కీలక వ్యాఖ్యానించారు. ఇక 294 స్థానాలకు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. 3 దఫాలుగా అధికారంలో ఉన్న టీఎంసీ కేవలం 80 సీట్లనే గెలుచుకుంది. మమతకు కంచుకోట అయిన భవానీపుర్‌లో ఆమె ఓటమి పాలయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News