Manchu Manoj Big Announcement: తన భార్య, మంచు వారి కోడలు భూమా మౌనికా రెడ్డి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారని సినీ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఖచ్చితంగా పోటీ చేస్తారని, తాము ఇప్పటికే రాజకీయాల్లో భాగమయ్యామని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఇక, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మనోజ్.. తెలుగు రాష్ట్రాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు గానూ ఇటీవల ఐక్య సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. రేపు (మే 20)న తన పుట్టినరోజు సందర్భంగా నేడు మీడియాతో మనోజ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఐక్య చేపట్టబోయే సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఇది ఎలాంటి రాజకీయ సంస్థ కాదని, రాజకీయాలకు ఈ సంస్థకూ ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజల గొంతుకగా ఉండేందుకు, నిరుపేదలు, నిస్సహాయులకు సహాయం చేసేందుకే ఈ సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. సంస్థ కార్యకలాపాల కోసం తన సొంత నిధులనే వెచ్చించనున్నట్లు తెలిపారు.
Also read: HMWSSB: జలమండలిలో ఉద్యోగాలంటూ ఫేక్ నోటిఫికేషన్ వైరల్.. అధికారుల కీలక ప్రకటన..!
వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తుంది..
ఇక, తన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడనే విషయంపై మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడగ్గా.. నేను పోటీ చేయడం లేదని, తన సతీమణి మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించారు. అయితే, ఏ పార్టీ? ఏ నియోజకవర్గం నుంచి? అనే విషయాలపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఇక, మీ నాన్నతో ఉన్న గొడవలు సద్దుమణిగాయా? అని మీడియా ప్రతినిధులు అడగ్గా.. ‘ఈ ప్రశ్న ఎవరిని అడగాలో మీకు తెలుసు. కానీ, మైక్‌తో వెళ్లకండి. వెళ్లినా హెల్మెట్ పెట్టుకోండి’ అని సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు.

