Challapalli police station: ఏపీలో విషాదఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడే ఉన్న పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇద్దరి పరిస్థితి విషమం: నిల్వ ఉంచిన బాణసంచా కారణంగా కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అక్కడే ఉన్న పలువురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చల్లపల్లి ఎస్‌ఐతో పాటు నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. దీంతో వెంటనే వారిని అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి అక్కడే ఉన్న కారు సైతం దెబ్బతిన్నది.
Also read-Goods train: ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం!
ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఐ: ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న సీఐ కేఎస్ రావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సైతం సీఐ పరామర్శించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

