HomeTop StoriesEnumamula: ఏనుమాముల మార్కెట్ వద్ద భారీ అగ్నిప్రమాదం..

Enumamula: ఏనుమాముల మార్కెట్ వద్ద భారీ అగ్నిప్రమాదం..

కాలి బూడిదైన ప్లాస్టిక్ స్క్రాప్ గోదాం..
రూ. 40లక్షలు నష్టపోయానని బాధితుడి ఆవేదన..

- Advertisement -

వరంగల్ సిటీ, (తెలుగుప్రభ) : ఏనుమాముల మార్కెట్ ఎదుట ఎన్టీఆర్ నగర్ రోడ్ లో గల చంద్రకిరణ్ కోల్డ్ స్టోరజి ఎదుట ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో జరిగిన ప్రమాదంలో ప్లాస్టిక్ స్క్రాప్ అంతా కాలి బూడిదయింది. ప్రమాద సమయంలో గోదాం ఆవరణలో ఉన్న ఓ బొలెరో వాహనం కూడా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు ఏనుమాముల సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

గోదాంలో భారీగా ప్లాస్టిక్ స్క్రాప్ నిల్వ ఉండటంతో అగ్నికీలలు భారీగా ఎగిసిపడ్డాయి. నాలుగైదు ఫైర్ ఇంజన్లు వచ్చినప్పటికీ మంటలు అదుపులోకి వచ్చేందుకు చాలా సమయం పట్టింది. ఉదయం 8:20గంటలకు జరిగినట్లు భావిస్తున్న ఈ ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. సాయి ప్లాస్టిక్ యజమాని, బాధితుడు జే.రామకృష్ణ మాట్లాడుతూ చంద్రకిరణ్ కోల్డ్ స్టోరేజీ ఎదుట గల స్థలంలో చెందిన స్థలంలో కొంతకాలంగా తాను స్క్రాప్ గోదాంను నిర్వహిస్తున్నట్లు తెలిపాడు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా గోదాంలో మంటలు చెలరేగినట్లు తనకు సమాచారం వచ్చిందని చెప్పారు. ప్రమాదంలో రూ. 40లక్షలు విలువైన ప్లాస్టిక్ స్క్రాప్ కాలి బూడిదఅయిందని వాపోయాడు. తమ గోదాం పక్కన నిర్మిస్తున్న ఓ గోదాంకు కరెంట్ తీసుకోవడం వల్లే షార్ట్ సర్క్యూట్ అయ్యిందని బాధితుడు ఆరోపించాడు.

ఉలిక్కి పడ్డ స్థానికులు..
స్క్రాప్ గోదాంలో ఆదివారం ఉదయమే అగ్నిప్రమాదం జరుగడంతో నిమిషాల వ్యవధిలోనే మంటలు గోదాం అంతటా వ్యాపించాయి. ఆ పరిసరాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. అగ్నిప్రమాదం విషయం తెలిసి స్థానికులు భారీగా గుమిగుడారు. కోటిలింగాల గుడి సమీపంలో కొన్నేళ్ల క్రితం జరిగిన బాణసంచా దుకాణం ప్రమాదాన్ని ఈ సందర్భంగా స్థానికులు గుర్తు చేసుకున్నారు. ఏనుమాముల సిఐ సురేష్, ఎస్సైలు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News