HomeTop StoriesOsmania Hospital: ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య విద్యార్థి ఆత్మహత్య

Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య విద్యార్థి ఆత్మహత్య

Medical student suicide: ఉస్మానియా ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఎమర్జెన్సీ వార్డు వద్ద జూనియర్ డాక్టర్ల ఆందోళనకు దిగారు.

- Advertisement -

జూనియర్ డాక్టర్ల ఆందోళన: వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలియగానే తోటి విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు భారీగా తరలివచ్చారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం వద్ద విద్యార్థులు బైఠాయించి ఆందోళనకు దిగారు. తోటి విద్యార్థి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆత్మహత్యకు గల కారణాలు!: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల ఆందోళనతో ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital) వద్ద భారీగా పోలీసులను మోహరించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News