Budh Gochar 2025 in December: జ్యోతిష్యశాస్త్రంలో బుధుడిని గ్రహాల యువరాజు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. ఇతడిని తెలివితేటలు, వ్యాపారం, తెలివితేటలు మెుదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. బుధుడి యెుక్క కదలిక మెుత్తం 12 రాశిచక్రాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. డిసెంబర్ నెలలో బుధుడు ధనస్సు, వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మెర్క్యూరీ యెుక్క ఈ సంచారాలు కొందరి జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసా?
మకర రాశి
డిసెంబరు బుధుడు సంచారం మకర రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. మీరు వేసుకున్న ఫ్లాన్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సెల్ఫ్ కాన్పిడెన్స్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులు శుభవార్త వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్, లాటరీల్లో పెట్టుబడులు పెట్టేవారు ఊహించని లాభాలను చూస్తారు. కెరీర్ లో గ్రోత్ ఉంటుంది.
మేష రాశి
బుధుడు రాశి మార్పు మేష రాశి వారికి మేలు చేస్తుంది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న ఉద్యోగం వస్తుంది. డబ్బును పొదుపు చేస్తారు. ప్రతి పనిలో లక్ ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. మీరు చేపట్టే ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇతరులతో పరిచయాలు పెరుగుతాయి.
Also Read: Shukra Gochar 2025-శనిదేవుడి రాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..
మీన రాశి
బుధుడు త్వరలో మీనరాశి వారి తలరాతను మార్చబోతున్నారు. ఎంతో కాలంగా ఆగిపోయిన మీ పనులు మళ్లీ మెుదలవుతాయి. అదృష్టం కలిసి వచ్చి మీకు ప్రభుత్వం ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లో ఊహించని లాభాలు ఉంటాయి. కెరీర్ లో అందనంత ఎత్తుకు చేరుకుంటారు. ఆధ్యాత్మికతపై మక్కువ కలుగుతుంది. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలను సాధిస్తారు. వృత్తిలో నైపుణ్యం సాధిస్తారు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం పూర్తిగా నిజమైనదని ఖచ్చితంగా చెప్పలేము. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


