Messi Faces Terror Threats:అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం,ప్రపంచ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీకి తీవ్రవాదుల నుంచి పెద్ద ప్రమాదం ఉన్నట్లు సమాచారం.మెస్సీని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడికి కుట్ర పన్నినట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి.స్పెయిన్‌కు చెందిన Informacion.es అనే పత్రిక సాధించిన లీకైన రహస్య నివేదిక ద్వారా భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఫిఫా ప్రపంచకప్ 2026 సమయంలో ఆటగాళ్లు, రెఫరీలు, ఇతర అధికారులను టార్గెట్ చేస్తూ పలు బాంబు బెదిరింపులు, వేధింపులు జరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా మెస్సీ, అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు ఇందులో పేర్కొన్నారు.
శరీరానికి నాలుగు బాంబులను..
ఈ నివేదికలోని అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తి అట్లాంటా స్టేడియంలోకి ప్రవేశించి మెస్సీని పేల్చేస్తానని బహిరంగంగా ప్రకటించడం. సదరు అనుమానితుడు సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ.. తన శరీరానికి నాలుగు బాంబులను కట్టుకుని అట్లాంటా స్టేడియంలోకి వెళ్లి మెస్సీని పేల్చివేస్తానని పోస్ట్ చేశాడు.
ఈ బెదిరింపును అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన భద్రతా సంస్థలు, ఎఫ్‌బీఐ, ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ (IPCC) సంయుక్త పర్యవేక్షణలో తక్షణ చర్యలు చేపట్టాయి
అట్లాంటా సంఘటనతో పాటు మరో ప్రమాదకర ఘటనను కూడా అధికారులు దర్యాప్తు చేశారు. డల్లాస్ విమానాశ్రయానికి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి, తాను, మరో ఇద్దరు వ్యక్తులు బాంబులు, AR-15 తుపాకులతో స్టేడియం వైపు వస్తున్నామని హెచ్చరికలు జారీ చేశాడు. తమ ప్రధాన లక్ష్యం పోలీసులు, ఫుట్‌బాల్ ఆటగాళ్లేనని, అందులో ముఖ్యంగా మెస్సీని టార్గెట్ చేశామని ఆ కాల్‌లో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ కాల్స్‌తో విమానాశ్రయం, స్టేడియం వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.
Also Read: TTD: టీటీడీ చరిత్రలోనే సరికొత్త రికార్డు..శ్రీవారికి భారీ హుండీ ఆదాయం

