Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. “వేగంగా దూసుకెళ్తున్న అమరావతి నిర్మాణం.. ఇక తగ్గేదే లే” అంటూ లోకేశ్ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. రాజధాని నిర్మాణ పనులకు ఇకపై ఎలాంటి బ్రేకులు పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
సారీ బ్రో.. ట్రోలర్స్‌పై సెటైర్లు: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను సైతం లెక్కచేయకుండా అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్లుగా పనులు టాప్ గేర్‌లో నడుస్తున్నాయని వెల్లడించారు. అమరావతిపై కావాలని తప్పుడు ప్రచారం చేసే వారిపై మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొద్దిగా వర్షం పడితే చాలు.. అమరావతి మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారికి సారీ బ్రో అని చెప్పక తప్పడం లేదు. వారి కష్టాన్ని నేను గుర్తిస్తున్నాను. వర్షం పడుతున్నప్పటికీ రాజధానిలోని ఏ ఒక్క సైట్‌లోనూ పనులు ఆగడం లేదని చాటిచెప్పడానికే ఈ వీడియో పోస్ట్ చేసినట్లు మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. అమరావతి నిర్మాణ ప్రయాణంలో ఇకపై ‘పాజ్'(ఆగడం) అనే మాటకు తావే లేదని స్పష్టం చేశారు. స్పీడ్ పెంచిన అమరావతి నిర్మాణమే నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అసలైన గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు.
#Amaravati is on full throttle – and there is no hitting pause. pic.twitter.com/CBCPAQlMbb
— Lokesh Nara (@naralokesh) June 14, 2026

