HomeTop StoriesRythu Bharosa: రైతులకు తీపి కబురు.. ఈనెల 26 నుంచి రైతు భరోసా.. మంత్రి ఉత్తమ్‌...

Rythu Bharosa: రైతులకు తీపి కబురు.. ఈనెల 26 నుంచి రైతు భరోసా.. మంత్రి ఉత్తమ్‌ క్లారిటీ..!

Minister Uttam clarifies on Rythu Bharosa Funds Release: ఖరీఫ్‌ సీజన్‌ పంట సాయం కోసం ఎదురుచూస్తోన్న రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 26 నుంచి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేయనునున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇరిగేషన్‌ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నేడు (బుధరవారం) సెక్రటేరియట్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్ల తెలిపారు. రాబోయే సాగు సీజన్‌లో రాష్ట్రంలో ఎలాంటి పంటలు వేయాలి, ఎన్ని రకాల పంటలు సాగు చేయాలనే అంశంపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.

- Advertisement -

Also Read: Harish Rao: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం.. సీఎం రేవంత్‌పై హరీష్‌ రావు ఫైర్‌

ఉచితంగా 7 రకాల విత్తనాల పంపిణీ..

ప్రస్తుతం రాష్ట్రంలో 7 రకాల విత్తనాలకు భారీ డిమాండ్ నెలకొందని వివరించారు. రైతులకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, అవసరమైతే ఆ ఏడు రకాల పంటలకు అదనపు బోనస్ ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై ఒకటి 2 రోజుల్లోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని వెల్లడించారు. మాన్సూన్ సీజన్ కోసం ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఏకంగా రూ.150 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాగా, రైతు భరోసా నిధుల విడుదలపై స్పష్టత రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News