Tuesday, December 9, 2025
HomeTop StoriesGold Rate: సోమవారం తగ్గిన బంగారం రేట్లు.. వెండి రేట్లు కూడా పడిపోయాయ్..

Gold Rate: సోమవారం తగ్గిన బంగారం రేట్లు.. వెండి రేట్లు కూడా పడిపోయాయ్..

Gold Price Today: సోమవారం బంగారం రేటు మళ్లీ తగ్గింది. ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కావటంతో చాలా మంది శుభకార్యాలకు షాపింగ్ షురూ చేస్తున్నారు. ఈ క్రమంలో వెండి రేట్లు కూడా దిగిరావటంపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేట్ల తగ్గింపుతో చాలా మంది వారం ప్రారంభంలోనే షాపులకు క్యూ కడుతున్నారు. అయితే ముందుగా తగ్గిన రేట్లను గమనించాలి.

- Advertisement -

గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. కానీ నెమ్మదిగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

సోమవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12,497 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,455 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.లక్ష 73 వేల వద్ద ఉంది.

ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,589, ముంబైలో రూ.12,497, దిల్లీలో రూ.12,512, కలకత్తాలో రూ.12,497, బెంగళూరులో రూ.12,497, కేరళలో రూ.12,497 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,540, ముంబైలో రూ.11,455, దిల్లీలో రూ.11,470, కలకత్తాలో రూ.11,455, బెంగళూరులో రూ.11,455, కేరళలో రూ.11,455 గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News