Friday, March 13, 2026
HomeTop StoriesCrime: ఘోర విషాదం.. ఇద్దరు పసిబిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

Crime: ఘోర విషాదం.. ఇద్దరు పసిబిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య!

Mother suicide after killing childrens: కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లే.. తన పిల్లలను కడతేర్చింది. అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

- Advertisement -

కుటుంబ కలహాలే కారణమా?: యాదాద్రి జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. గొల్లగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ తన పది నెలల పసికందుతో పాటు రెండేళ్ల కుమారుడిని అత్యంత దారుణంగా చంపింది. అనంతరం ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మృతురాలి భర్త రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మనస్పర్థల కారణంగానే సదరు మహిళ చిన్నారులతో సహా ఆత్మహత్యకు ఒడిగట్టి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also read-Crime: తండ్రిని చంపి.. శవాన్ని ముక్కలు చేసిన కుమారుడు!

రంగంలోకి పోలీసులు: ఒకే ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనకు అసలు కారణం కుటుంబ కలహాలా లేక మరేదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News