HomeTop StoriesOwaisi: పరీక్షలు వాయిదా వేయండి.. సీఎంను కోరిన అసదుద్దీన్ ఓవైసీ

Owaisi: పరీక్షలు వాయిదా వేయండి.. సీఎంను కోరిన అసదుద్దీన్ ఓవైసీ

Degree exams: ఓయూ పరిధిలో మే 28 నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని ఎంఐఎం (MIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా సీఎంకు ఒక విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

మే 28న బక్రీద్ పండుగ: పరీక్షలు ప్రారంభమయ్యే మే 28న ముస్లింల పవిత్ర పండుగ ‘ఈద్-ఉల్-అదా’ (బక్రీద్) ఉండే అవకాశం ఉందని ఓవైసీ పేర్కొన్నారు. పండుగ రోజునే పరీక్షలు నిర్వహించడం వల్ల ముస్లిం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పండుగ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మే 28న జరగాల్సిన పరీక్షలను మరో తేదీకి వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను ఓవైసీ కోరారు. ముస్లిం విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం మరియు వర్సిటీ యంత్రాంగం ఈ విషయంపై సానుకూలంగా స్పందించి, పరీక్షల రీ-షెడ్యూల్‌ను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News