HomeTop StoriesNEET: నేడు నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు!

NEET: నేడు నీట్‌ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు!

NEET-UG 2026 Exam: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో (MBBS, BDS) ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్-యూజీ 2026’ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్ష కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా 199 కేంద్రాలు: తెలంగాణలోని 24 ప్రధాన పట్టణాల్లో మొత్తం 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 69 కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 73,084 మంది విద్యార్థులు నీట్‌ పరీక్ష రాయనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ముఖ్య పట్టణాలతో పాటు మొత్తం 24 ప్రాంతాల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

మధ్యాహ్నం 1:30 తర్వాత నో ఎంట్రీ: పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థుల ప్రవేశంపై ఎన్‌టీఏ కఠిన నిబంధనలు విధించింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. అయితే మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోపలికి అనుమతించరు. పరీక్షకు మూడు గంటల ముందే అనగా ఉదయం 11 గంటల నుంచే గేట్లు తెరుస్తారు. ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు: ఎన్‌టీఏ ప్రకటించిన డ్రెస్ కోడ్ నిబంధనలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలి. నిషేధిత వస్తువులైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, కాలిక్యులేటర్లు, అనవసర కాగితాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News