HomeTop StoriesTheft: హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్‌ భారీ చోరీ!

Theft: హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్‌ భారీ చోరీ!

Nepali gang: హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. యజమానుల నమ్మకాన్ని వమ్ముచేస్తూ.. సుమారు కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఎత్తుకెళ్లింది. ఈ సంచలన ఘటన గచ్చిబౌలిలోని ప్రముఖ ‘హిల్ రిడ్జ్ విల్లాస్‌’లో వెలుగుచూసింది.

- Advertisement -

నెల రోజుల క్రితమే పనిలో చేరిన నేపాలీ: పోలీసుల కథనం ప్రకారం.. హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారి ఇంట్లో.. నెల రోజుల క్రితమే నేపాలీ దంపతులు పనిలో చేరారు. వారి ప్రవర్తన నమ్మి వ్యాపారి కుటుంబం ఇటీవల ఒక ముఖ్యమైన పని మీద ముంబయికి వెళ్లింది. దీన్నే అదనుగా భావించిన ఆ దంపతులు.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి లాకర్‌లోని కేజీ బంగారాన్ని, వజ్రాలను దోచుకుని పారారయ్యారు.

ముంబయి నుంచి రాగానే షాక్!: బాధిత వ్యాపారి కుటుంబం ముంబయి పర్యటన ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి.. ఇల్లంతా చెల్లాచెదురుగా పడి ఉంది. లాకర్‌లో ఉండాల్సిన కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు, బంగారు నగలు మాయమవడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. పనిమనుషులుగా ఉన్న దంపతులు ఇంట్లో లేరు. వెంటనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read-Bengaluru: అమ్మతనానికే మచ్చ.. ప్రియుడి మోజులో కూతురిని చంపిన తల్లి!

పోలీసుల దర్యాప్తు తీవ్రం: ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విల్లా ప్రాంగణంలోని, అలాగే ఇంట్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News