Friday, December 12, 2025
HomeTop StoriesBigg Boss 9: బిగ్ బాస్ హౌస్ లో పాత కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. నామినేట్...

Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్ లో పాత కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. నామినేట్ చేస్తూ ఒక్కొక్కరి మాస్క్ తీసేస్తూ

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 అక్టోబర్ 27న మరో నామినేషన్ ఘట్టానికి సిద్ధమైంది. ఇందులో హౌస్ నుంచి బయటకు వెళ్లిన కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి నామినేషన్ చేయడం చాలా ఇంట్రస్టింగ్ అనిపిస్తోంది. ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఎపిసోడ్ కూడా పూర్తిగా అదిరిపోయేలా ఉంది. ముఖ్యంగా లోపల ఉన్న కంటెస్టెంట్స్ ను బయటకు వెళ్లిన వారు వచ్చి నామినేట్ చేస్తే వచ్చే కిక్కు భలే ఉంటుంది. అందుకే ఈసారి చదరంగం కాదు రణరంగం అని బిగ్ బాస్ కు క్యాప్షన్ ఇచ్చారు.

- Advertisement -

Read More: పానీపూరి దొంగతనం చేసి తిన్న సుమన్ శెట్టి, తనూజ .. బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఫన్
పాత కంటెస్టెంట్ చేతులో నామినేట్ అస్త్రం
బిగ్ బాస్ లోపలికి ప్రియ, శ్రీజ, మర్యాద మనీశ్ , ఫ్లోరా ఎంట్రీ ఇచ్చి పాత కంటెస్టెంట్ పై నిప్పులు చెరిగారు. ఒక్కొక్కరికి రెండు కత్తులిచ్చారు. ఒకటి నామినేట్ చేయడానికి, రెండో కత్తి నామినేషన్ పవర్ ని వేరే వాళ్లకి ఇచ్చేందుకు దాంతో వేరే వాళ్లని నామినేట్ చేయడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ మరో ట్విస్టు ఉంది. కొంతమంది నామినేట్ అయిన కంటెస్టెంట్స్ బయటకు వెళ్లకుండా డైరెక్టుగా అదే బిగ్ బాస్ లో ఉండిపోనున్నారు.ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చి ఎలివేషన్స్ అదిరిపోయాయి. వీరిలో కొంతమంది బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారని బిగ్ బాస్ హింట్ ఇవ్వడంతో ఇక ఆట మరో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Read More: Bigg Boss 9: పచ్చళ్ల పాప బిగ్ బాస్ నుంచి అవుట్
సంజనకు ఇచ్చి పడేసిన ప్రియ..
పాత కంటెస్టెంట్ ప్రియ సంజనా కి పోటు పొడిచి కంట్రోల్ తప్పిన ఆమె నోటికి తాళం వేసింది. ముఖ్యంగా దివ్య గురించి సంజన బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ సంజనకి ఇచ్చి పడేసింది. రోడ్ రోలర్ అనే పదం వాడకూడదు ఎందుకన్నారు. దీనికి సంజన నాకు నేను అలాగే ఉంటాను అందుకే అన్నాను అని చెప్పింది. అయితే మీరు లక్ష అనుకోండి మిగతా వారిని అనొద్దు కదా అని కడిగి పారేసింది. దీనిపై సంజన నాగార్జున తో పోయిన ఎపిసోడ్ లో ఏది చెప్పిందో ఇక్కడే కూడా అదే వర్షన్ వినిపించినట్లయింది. మర్యాద మనీశ్ కల్యాణ్ కు ఇచ్చి పడేశాడు. నీకు వీడియోలు చూపించారు కరెక్టే మిగతా వారికి కూడా అలాగే చూపిస్తారు కదా అంటూ కల్యాణ్ గురించి మైనస్ పాయింట్లు వివరించాడు. ఇమ్మాన్యువేల్ నిన్ను నమ్మి నామినేట్ చేయడానికి టికెట్ ఇస్తే నువ్వు సంజనను ఎలిమినేట్ ఎలా చేస్తావ్ అని ప్రశ్నించాడు. ఇది వెన్నుపోటు అని ఇలాంటి వాటితోనే క్యారెక్టర్ బయటకు వస్తుందని చెప్పాడు.

తనూజను నామినేట్ చేసిన ఇమ్మాన్యువేల్
ఇక ప్రోమోకే హైలెట్ ఇమ్మాన్యువేల్.. తనూజని నామినేట్ చేయడం. బొమ్మల గేమ్ లో తనూజ తన కోసం ఆడి చివరకు రాముకు ఓటేయడం బాధేసిందని దీంతో నాకు మైండో పోయిందని తనూజకి పాయింట్ చెప్పి నామినేట్ చేశాడు. దీనికి ఇమ్మాన్యువేల్ పై తనూజ మండిపడింది. రెండు నాలుకలతో మాట్లాడుతున్నవ్ అని అరిచింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరగ్గా చివరకు ఇమ్మాన్యువేల్ తనూజకు ఒక్క పోటు పొడిచాడు. వీరితో పాటు కల్యాణ్, రాము రాథోడ్ ని నామినేట్ చేస్తూ నువ్వు కెప్టెన్ కాలేకపోయావని అంటాడు. దీనికి నువ్వు కూడా కాలేదు కదా గుర్తు పెట్టుకో అని పంచ్ ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ కొనసాగింది. మొత్తం మీద పాత కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం చాలా ఇంట్రస్టింగ్ అనిపించింది. ఎపిసోడ్ కూడా అదే రేంజ్ లో పేలిపోనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News