Sunday, February 8, 2026
HomeTop StoriesCP Sajjanar: హైదరాబాద్‌లో ‘ఆపరేషన్‌ కవచ్’.. ఏకకాలంలో 5 వేల మంది పోలీసులతో తనిఖీలు

CP Sajjanar: హైదరాబాద్‌లో ‘ఆపరేషన్‌ కవచ్’.. ఏకకాలంలో 5 వేల మంది పోలీసులతో తనిఖీలు

Operation Kavach: నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేసే దిశగా హైదరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్‌ కవచ్‌’ (Operation Kavach) పేరిట భారీ నాకాబందీ (ఆకస్మిక తనిఖీలు) నిర్వహించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ నేతృత్వంలో శుక్రవారం రాత్రి ఈ ఆపరేషన్ జరిగింది. ఏకకాలంలో 5,000 మంది పోలీసులతో ఈ ఆపరేషన్‌ చేపట్టారు.

- Advertisement -

కమిషనరేట్‌ చరిత్రలో తొలిసారి: 5,000 మంది పోలీసు సిబ్బందితో నాకాబందీ చేపట్టడం కమిషనరేట్‌ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఏకకాలంలో నగరంలోని 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌, టాస్క్‌ ఫోర్స్‌ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్‌ రిజర్వ్ (AR), బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. చాంద్రాయణ గుట్టలో జరిగిన ఆపరేషన్ కవచ్ లో ఆడిషనల్ కమిషనర్ టఫసీర్ ఇక్బల్ పాల్గొన్నారు.

Also Read:https://teluguprabha.net/top-stories/hydra-commissioner-ranganath-apologizes-to-the-high-court/https://teluguprabha.net/top-stories/hydra-commissioner-ranganath-apologizes-to-the-high-court/

సీపీ సజ్జనార్ కీలక సూచనలు: ‘ఆపరేషన్‌ కవచ్’ నేపథ్యంలో సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్‌ సజ్జనార్ కీల‌క పోస్ట్ పెట్టారు. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ తనిఖీలకు నగర పౌరులందరూ పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్ అనంతరం, సీపీ సజ్జనార్ ఎక్స్‌ వేదికగా కూడా ఈ వివరాలను పంచుకుంటూ.. “మీ భద్రత – మా బాధ్యత” అని ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News