Operation Sindoor: దేశ భద్రత విషయంలో రాజీ పడబోమని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదంపై మన కఠిన వైఖరికి ‘ఆపరేషన్ సిందూర్’ నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ఆపరేషన్ చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అంతేకాకండా మోదీ తన ఎక్స్ ఖాతా డీపీ (DP)గా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు.
కుట్రదారులకు గుణపాఠం: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సమయంలో మన బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధాని కొనియాడారు. “మన సైన్యం సాటిలేని ధైర్యం, కచ్చితత్వాన్ని ప్రదర్శించి పహల్గాం కుట్రదారులకు తగిన గుణపాఠం చెప్పింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది” అని మోదీ పేర్కొన్నారు.
Also read-Trump- Modi: బెంగాల్‌లో బీజేపీ విజయంపై ప్రధాని మోదీకి ట్రంప్ అభినందనలు
ప్రత్యేక వీడియోను విడుదల చేసిన వైమానిక దళం: ఆపరేషన్ సిందూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా భారత వైమానిక దళం (IAF) ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలను మన సైన్యం ఎలా నేలమట్టం చేసిందో దృశ్యరూపంలో వివరించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమై ఏడాది పూర్తయిన వేళ.. దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో భారత సైన్యం పరాక్రమంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
A year ago, during #OperationSindoor, our armed forces showcased their valour and gave a firm response to those who attacked our people. Every Indian is proud of our armed forces. As a mark of respect to our forces and their success during #OperationSindoor, let us all change our… pic.twitter.com/w4A3j1bGTw
— Narendra Modi (@narendramodi) May 7, 2026

