HomeTop StoriesKolimigundla: కంప చెట్లు ఇలా .. ప్రయాణం సాగేదెలా ...?

Kolimigundla: కంప చెట్లు ఇలా .. ప్రయాణం సాగేదెలా …?

సీసీ రోడ్డుకు ఇరువైపులా పెరిగి ఉన్న కంప చెట్లు
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

- Advertisement -

కొలిమిగుండ్ల, (తెలుగు ప్రభ): కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల చింతలాయపల్లి గ్రామాల ప్రధాన రహదారికి ఇరువైపులా కంప చెట్లు విపరీతంగా పెరిగి ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రమైన కొలిమిగుండ్ల నుండి ఇటిక్యాల చింతలాయ పల్లి మీదుగా అబ్దుల్లాపురం, కోరుమాను పల్లి, తోళ్ళమడుగు, ఉమ్మాయి పల్లి, కోరుమాను పల్లి గ్రామాలకు ఈ రహదారి దగ్గర దారి అవుతుంది. దీంతో మండల కేంద్రంలో ఇతర పనులకు ప్రభుత్వ కార్యాలయాలకు అలాగే ఈ గ్రామాల నుండి మోడల్ స్కూలు మరియు జూనియర్ కాలేజీకి విద్యార్థిని విద్యార్థులు విద్యార్థి బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు.

మరి ముఖ్యంగా ఈ రహదారిలో మోటార్ సైకిలిస్టు లు, గనులకు వెళ్లే జీపులు, ట్రాక్టర్లు లలో ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఇటిక్యాల సమీపంలో సీసీ రోడ్డుకి ఇరువైపులా కంప చెట్లు విపరీతంగా పెరిగి సిసి రోడ్డుకు మూసి వేస్తూ ఉన్నాయి. మోటార్ సైకిల్ లిస్టులు ,జీపులు, ట్రాక్టర్లలో ప్రజలు వెళుతున్న సమయంలో వాహనాలు ఎదురు ఎదురుగా వచ్చినప్పుడు వాహనదారులు తప్పకుండా సైడ్ తొలగాల్సి వచ్చిన క్రమంలో ఈ కంప చెట్లు వాహనదారులను తీవ్ర ఇబ్బందులు చేస్తున్నాయి.

అలాగే బనగానపల్లి, కోవెలకుంట్ల ప్రాంతాల నుంచి తాడిపత్రి మండలం ఆలూరు కోన, ఊరు చింతల , హాజీవలి దర్గా మొదలగు ప్రాంతాలకు వెళ్లాలన్న కూడా ఇటిక్యాల చింతలయపల్లి మీదుగా ఆ ప్రాంతాల ప్రయాణికులకు దగ్గర దారి అవుతుంది. అయితే ఈ సిసి రోడ్డు కు ఇరువైపులా కంప చెట్లు పెరిగి ఉండడం ప్రయాణికులకు ఇబ్బందులు కలగజేస్తున్నాయని, సంబంధిత అధికారులు ఈ కంప చెట్లను తొలగించే చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Also Read: Vaira: సత్రం బజారులో కాలువకు మోక్షం.. కౌన్సిలర్ చొరవతో పూడిక తొలగింపు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News