Sri Lanka vs Pak: టీ20 ప్రపంచకప్‌లో పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే నేడు శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అద్భుతం చేయాల్సిందే. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాలవ్వడం పాకిస్తాన్‌కు వరంగా మారింది. ప్రస్తుతం గ్రూప్-2 నుండి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్‌కు క్వాలిఫై అవ్వగా.. రెండో స్థానం కోసం పాక్, న్యూజిలాండ్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
పాక్ ముందున్న సమీకరణాలు: ప్రస్తుతం న్యూజిలాండ్ మెరుగైన నెట్ రన్ రేట్‌తో ఉంది. కివీస్ నెట్‌రన్‌రేట్ +1.390గా ఉంది. దీనిని అధిగమించాలంటే పాకిస్తాన్ నేటి మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. పాక్ మొదట బ్యాటింగ్ చేస్తే.. శ్రీలంకపై కనీసం 64 పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఒకవేళా ఛేజింగ్‌కు దిగితే తమ టార్గేట్‌ను 13.1 ఓవర్లలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో ఏదో ఒకటి జరిగితేనే పాక్ రన్ రేట్ న్యూజిలాండ్ కంటే మెరగై సెమీస్ బెర్త్ ఖాయమవుతుంది. లేదంటే పాక్ ప్రస్థానం టీ20 ప్రపంచకప్‌లో నేటితో ముగియనుంది. దీంతో పాక్‌కు శ్రీలంకతో జరిగే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.
Also read-Chilli price: ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి జోరు.. క్వింటాల్ ధర రూ. 50 వేలు!
వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే: ఒకవేళ శ్రీలంక పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే మాత్రం న్యూజిలాండ్‌కు బెనిఫిట్ అవుతుంది. అప్పుడు పాక్ ఖాతాలో 2 పాయింట్లు మాత్రమే ఉంటాయి. దీంతో 3 పాయింట్లతో ఉన్న కివీస్ సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే సెమీస్‌కు న్యూజిలాండ్ వెళ్తే.. కోల్‌కతా వేదికగా ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాక్ వెళ్తే కొలంబో వేదిక అయ్యే అవకాశం ఉంది.

