HomeTop StoriesTelangana: మీసేవ కేంద్రాలకు రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు.. ఇకనుంచి నో రిసీప్ట్‌!

Telangana: మీసేవ కేంద్రాలకు రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు.. ఇకనుంచి నో రిసీప్ట్‌!

MeeSeva: రాష్ట్రంలో డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (జూన్ 19) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవా (Meeseva) కేంద్రాల్లో సాంప్రదాయ కాగితపు రశీదుల విధానానికి స్వస్తి పలకాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వినియోగదారులకు కేవలం SMS ద్వారా మాత్రమే డిజిటల్ రశీదులను అందజేయాలని పేర్కొంది.

- Advertisement -

మొబైల్‌కు రశీదు!: మీసేవా కేంద్రాల్లో ఏ రకమైన సర్టిఫికెట్ లేదా ప్రభుత్వ సేవ కోసం దరఖాస్తు చేసుకున్నా.. దరఖాస్తుదారుడికి చేతికి ఎలాంటి కాగితపు రశీదు ఇవ్వరు. దానికి బదులుగా.. దరఖాస్తు సమయంలో నమోదు చేసిన యాక్టివ్ మొబైల్ నంబర్‌కు నేరుగా ఒక SMS వస్తుంది. ఆ డిజిటల్ రిసీప్ట్‌లో చెల్లించిన ఫీజు వివరాలతో పాటు దేనికోసం దరఖాస్తు చేసుకున్నామనే పూర్తి వివరాలు ఉండనున్నాయి. ఈ రిసీప్ట్‌ అత్యంత కీలకమైన అంశం అప్లికేషన్ నెంబర్. ఈ నెంబర్‌ ఉంటే మన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Also read-TG Pensions: షాకింగ్‌ న్యూస్‌.. ఒకేసారి 1.28 లక్షల పెన్షన్లు రద్దు.. మీ పేరు ఉందేమో చూసుకోండి..!

లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు ఇవే: కాగితపు రశీదులు చిరిగిపోతాయనే లేదా పోగొట్టుకుంటామనే భయం ఇక ఉండదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్ ద్వారానే అప్లికేషన్ స్టేటస్‌ను సులభంగా చెక్ చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ కాగితం వాడకం తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. అయితే ఈ కొత్త విధానం ద్వారా ప్రజలు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రస్తుతం తాము వాడుకలో ఉంచిన (Active) కరెక్ట్ మొబైల్ నంబర్‌ను మాత్రమే నమోదు చేయించుకోవాలి. తప్పుడు నంబర్ ఇస్తే SMS రాకపోవడమే కాకుండా.. భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం మరియు సర్టిఫికెట్లు పొందడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News