Shanagonda village: కనుమరుగవుతున్న ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునేందుకు ఓ సర్పంచ్ వినూత్న ప్రయోగానికి స్వీకారంచుట్టారు. తన ఊరిలోని ప్రభుత్వ బడి ఎట్టిపరిస్థితుల్లోనూ మూతపడకూడదనే పట్టుదలతో.. ఆ స్కూల్లో చేరే ప్రతి విద్యార్థికి రూ. 2,000 నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. దీంతో ఆ ఊరి ప్రజలందరూ సర్పంచ్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. అయితే ఈ స్కూల్ ఏ జిల్లాలో ఉందో తెలుసుకుందాం!
మార్పు కోసం వినూత్న ఆలోచన: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామ సర్పంచి జీల రాజు సరికొత్త విధానాన్ని ప్రకటించారు. శానగొండ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Primary School) లో విద్యార్థుల సంఖ్య ఏటా దారుణంగా పడిపోతోంది. గత విద్యా సంవత్సరంలో ఈ బడిలో కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2026-27) కొత్తగా ఒక్క విద్యార్థి కూడా చేరే పరిస్థితి కనిపించకపోవడంతో స్కూల్ పూర్తిగా మూతపడే ప్రమాదం ఏర్పడింది. దీనిని గమనించిన సర్పంచ్ జీల రాజు ఎలాగైనా బడిని బతికించుకోవాలని సంకల్పించారు. అందులో భాగంగానే విద్యార్థుల తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ఈ నగదు బహుమతిని ప్రకటించారు. ఈ మొత్తాన్ని రాబోయే దసరా పండుగ నాటికి విద్యార్థులకు అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Also read- CM Revanth Reddy: “రక్తదానం.. ఒక ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నత మానవతా సేవ”
ఇంటింటి ప్రచారాన్ని చేపట్టిన సర్పంచ్: ఈ వినూత్న ప్రచారంలో భాగంగా శనివారం ‘బడి బాట’ కార్యక్రమాన్ని సర్పంచ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఊరి ప్రజలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. “ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యా సదుపాయాలన్నింటినీ గ్రామంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపి ఆర్థికంగా భారం పడకుండా

