HomeTop StoriesDog attack: పంజాబ్‌లో భయానక ఘటన.. పెంపుడు కుక్క దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు

Dog attack: పంజాబ్‌లో భయానక ఘటన.. పెంపుడు కుక్క దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు

Dog attack: పెంపుడు కుక్కల దాడికి సంబంధించిన భయానక ఘటన పంజాబ్‌లో వెలుగు చూసింది. రియల్ ఎస్టేట్ డీలర్‌తో కలిసి కొత్త ఇల్లు చూసేందుకు వెళ్లిన దంపతులపై పెంపుడు శునకం విరుచుకుపడింది. ఈ దాడిలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియా తెగ వైరల్‌ అవుతుంది.

- Advertisement -

అసలేం జరిగిందంటే: పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పెంపుడు శునకం వీరంగం సృష్టించింది. ఇంటి కొనుగోలు నిమిత్తం రియల్ ఎస్టేట్ డీలర్‌తో కలిసి దంపతులు ఓ ఫ్లాట్‌ను పరిశీలిస్తున్నారు. ఆ ఇంటిలోపల పరిశీలించేందుకు దంపతులు గేట్‌ వద్ద ఉన్న డోర్‌బెల్ కొట్టారు. దీంతో పిట్‌బుల్ అనే జాతికి చెందిన కుక్క ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చి వారిపై దాడి చేసింది. దంపతుల కేకలు విన్న స్థానికులు తక్షణమే స్పందించి అక్కడికి పరుగులు తీశారు. అతికష్టమీద కుక్కను వారి నుంచి వేరుచేసి దంపతుల ప్రాణాలు కాపాడారు. అప్పటికే ఆ కుక్క జరిపిన దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

ఆసుపత్రికి తరలింపు: అప్రమత్తమైన స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న బాధితులను వెంటనే పాటియాలాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెంపుడు కుక్కల యజమానులు తగిన జాగ్రత్తలు చర్యలు పాటించాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News