Fuel Prices Increased Again:దేశవ్యాప్తంగా సామాన్యుడిపై ఇంధన భారం మరింతగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో.. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా సవరణ ప్రకారం లీటరు పెట్రోల్, డీజిల్‌పై సగటున 90 పైసల చొప్పున ధరలు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
ధరల పెంపునకు గల కారణాలు: పశ్చిమాసియా సంక్షోభం: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వారం క్రితం వరకు దేశీయంగా ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే దీనివల్ల కంపెనీలు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటుండటంతో భారాన్ని కొంతమేర వినియోగదారులపై వేయక తప్పలేదని అధికారులు పేర్కొంటున్నారు.
Also read-Ibrahimpatnam: క్లాస్‌మేట్‌పైనే కన్నేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం తాగించి మరీ!
ఆందోళనలో సామాన్యుడు: వారం రోజుల వ్యవధిలోనే చమురు సంస్థలు రెండోసారి రేట్లు పెంచడంతో రవాణా ఖర్చులు పెరిగాయి. అయితే నిత్యావసర వస్తువుల ధరలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

