Plane crash: అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF)కు చెందిన ఏఎన్-32(AN-32) విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. రన్‌వేపై ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మంటలు భారీగా చెలరేగాయి.
వేగంగా స్పందించిన సిబ్బంది: ప్రమాదం జరిగిన వెంటనే వైమానిక దళ అత్యవసర సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెస్క్యూ టీమ్‌తో వెంటనే రంగంలోకి దిగాయి. సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలతో పాటు ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

