HomeTop StoriesPM Modi: దేశానికే అతిపెద్ద ఉపాధి కేంద్రంగా సైబరాబాద్‌.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

PM Modi: దేశానికే అతిపెద్ద ఉపాధి కేంద్రంగా సైబరాబాద్‌.. ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

Cyberabad has become the biggest employment hub: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో సైబరాబాద్‌ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. అనేక పెద్ద ప్రాజెక్టులు సైబరాబాద్‌లోనే పురుడు పోసుకుంటున్నాయని చెప్పారు. హెచ్‌ఐసీసీలో రూ.9,377 కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “అభివృద్ది ప్రణాళికలతో దేశంలోనే అతి పెద్ద ఉపాధి కేంద్రంగా సైబరాబాద్‌ మారింది. సైబర్‌ టెక్నాలజీ, విద్యుత్‌, ఈవీ రంగాల్లో సైబరాబాద్‌ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్‌ పార్కును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దేశ టెక్స్‌టైల్‌ రంగంలో సైబరాబాద్‌ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. దీంతో, రాబోయే రోజుల్లో సైబరాబాద్‌ ఉద్యోగాలకు కేరాఫ్‌గా మారనుంది. జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. దీని ద్వారా తెలంగాణ కూడా ఎంతో లాభపడుతోంది”అని మోదీ స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/telangana-will-develop-faster-if-modi-has-blessings/

నేడు ప్రధాని ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే..

1. ప్రధాని మోదీ జహీరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టును ప్రారంభించారు. దీని వ్యయం రూ.2,360.54 కోట్లు.
2. జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడెబల్లూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. దీని విలువ రూ.3,175 కోట్లు.
3. వరంగల్‌లోని ‘పీఎం మిత్ర’ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును ప్రారంభించారు. దీని విలువ రూ.1,695.54 కోట్లు.
4. హైదరాబాద్‌ సమీపంలోని మల్కాపూర్‌ వద్ద నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్‌ పీవోఎల్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. దీని విలువ రూ.611 కోట్లు.
5. 118 కి.మీ. మేర కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్‌ రైల్వే ప్రాజెక్టును ప్రారంభించారు. దీని విలువ రూ.1,243 కోట్లు.
6. 21 కి.మీ. మేర కాజీపేట రైల్‌ అండ్‌ రైల్‌ బైపాస్‌ రైల్వే లైను ప్రారంభించారు. దీని విలువ రూ.292 కోట్లు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News