PM Modi on kasibugga Stampede: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో ఏకంగా 9 మంది మరణించి, ఇద్దరు గాయపడ్డారు. అలాగే తొక్కిసలాటలో గాయపడిన వారికి 50,000 రూపాయల సాయం ప్రకటించింది కేంద్రం. ఈ ఘటన వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా పోటెత్తిన భక్తుల తాకితో జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు.
కాశీబుగ్గలో ఉదయం 11:30 గంటల సమయంలో ఆలయంలో భారీగా భక్తులు చేరడంతో బాగా గుమిగూడారు. దీంతో అనుకోకుండా క్యూలైన్లలో జరిగిన ప్రమాదంతో తొక్కిసలాట జరిగిందని DSP లక్ష్మణ్ రావు తెలిపారు. ఇది ఒక తీవ్రమైన ప్రమాదమని.. తగిన రెస్కూ చర్యలు చేపట్టి వెంటనే బాధితులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు అధికారి.
ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందించాలని ఆదేశించారు. నారా లోకేష్ కూడా బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. ఈ ఘటనపై విచారణ ఆదేశిస్తూ.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. ఈ దుర్ఘటన తర్వాత ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలు కాశీబుగ్గ ప్రాంత ప్రజలకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పవిత్ర కార్తీకమాసంలో ప్రసిద్ధ క్షేత్రాలకు ప్రజలు వెళ్లే సమయంలో అప్రమత్తతతో పాటు అధిక సంఖ్యలో వచ్చే ప్రజలకు అవసరమైన సదుపాయాలు.. వేగంగా దర్శనాలకు తగిన ఏర్పాట్ల అవసరాన్ని తాజా ప్రమాదం హైలైట్ చేస్తోంది.


