Friday, December 12, 2025
HomeTop StoriesLaksha Kantha Gita Parayana : ఉడిపి గీత పారాయణలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రత్యేక...

Laksha Kantha Gita Parayana : ఉడిపి గీత పారాయణలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు

Modi Udipi Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని ఉడుపి శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష కంఠ భగవద్గీత పఠనం(Laksha Kantha Gita Parayana) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో దాదాపు లక్ష మంది విద్యార్థులు, సన్యాసులు, పండితులు, భక్తులు కలిసి ఒకేసారి భగవద్గీత చదవడంతో ఉడుపి వాతావరణం ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయింది. పర్యాయ పుతిగే మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర స్వామి, మఠం దివాన్, సీనియర్ అధికారులు ప్రధానికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. వెండి పొదిగిన తులసీమాల, ముద్రలను ప్రధానికి అందజేశారు. ఈ క్రమంలో ఉడిపి రాక తనకు ప్రత్యేకమైనదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమం ఉడుపిలో జరగటంతో ప్రధాని మోదీ చాలా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉందని గుర్తుచేసుకున్నారు. 1968లో ఇక్కడ జనసంఘ్ ప్రభావంతో వీఎస్ ఆచార్యను మున్సిపల్ కౌన్సిల్ కి ఎన్నుకున్నారని, మంచి పాలన ప్రారంభమైందని అన్నారు. అందుకు ఉడుపిని కర్మభూమిగా పేర్కొన్నారు. ఫలం గా ప్రజలు మద్దతు ఇచ్చి స్థానిక పాలనలో పెద్ద క్రమబద్ధతకు దారి తీసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. దాదాపు 2 దశాబ్దాల క్రితమే ఉడిపిలో న్యూ గవర్నెన్స్ మోడల్‌కు పునాదులు పడ్డాయని అన్నారు మోదీ.

also read Rahul Gandhi ఢిల్లీలో ఊపిరాడని పరిస్థితి.. మోదీ మౌనం ఎందుకు? రాహుల్ గాంధీ ఆగ్రహం!

ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రీ కృష్ణ మఠంలోని మందిరాల్లో పవిత్ర పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణుని గర్భగుడి ముందు ఉన్న సువర్ణ తీర్థ మంటపాన్ని పుణ్యక్షేత్రం గా ప్రారంభించి, పవిత్ర కనక కవచాన్ని అంకితం చేశారు. ఇది కనకదాసు శ్రీ కృష్ణుని దర్శనానికి సంబంధించిన పవిత్ర చిహ్నమని విశ్వసిస్తారు.

ఉడుపి శ్రీ కృష్ణ మఠం భగవద్గీత పాఠన కార్యక్రమం కేవలం ఆధ్యాత్మికానికి మాత్రమే కాదని.. రాజకీయ, సాంస్కృతిక అంశాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రధాని మోదీ పర్యటనతో పాటు బీజేపీ పాలనకు ఉడుపి ఒక గొప్ప తటస్థ భూమిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. లక్ష మందితో ప్రధాని మోదీ కూడా గొంతు కలపటం ఒక కొత్త చరిత్ర లిఖించింది. దీనికి ముందు 2008లో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చారు మోదీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News