HomeTop StoriesPM Modi: అరుదైన దృశ్యం.. సీనియర్‌ నేత కాళ్లు మొక్కిన ప్రధాని మోదీ

PM Modi: అరుదైన దృశ్యం.. సీనియర్‌ నేత కాళ్లు మొక్కిన ప్రధాని మోదీ

PM Modi: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన వేళ.. వేదికపై ప్రధాని మోదీ చూపిన నిరాడంబరత అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకంటే వయసులో పెద్దవారైన ఓ సీనియర్ నేత పాదాలను ప్రధాని మొక్కారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని ఆ వృద్ధుడి కాళ్లు మొక్కడంతో.. ఆ సీనియర్‌ నేత ఎవరనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

- Advertisement -

ఎవరీ మఖన్‌లాల్‌ సర్కార్‌?: ఆయన పేరు మఖన్‌లాల్‌ సర్కార్‌. 98 ఏళ్ల వయసున్న ఈయన బీజేపీ(పూర్వపు జనసంఘ్)లో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు. ఆయన నేపథ్యం వింటే ప్రధాని మోదీ ఎందుకు అంతటి గౌరవం ఇచ్చారో అర్థమవుతుంది. 1952లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన కశ్మీర్ ఉద్యమంలో మఖన్‌లాల్‌ చురుగ్గా పాల్గొన్నారు. కశ్మీర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు గాను ఆయన ఆ కాలంలోనే జైలు శిక్ష అనుభవించారు.

Also read-West Bengal: బెంగాల్ గడ్డపై వికసించిన కమలం.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు

క్రమశిక్షణ కలిగిన కార్యకర్త: దశాబ్దాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం బెంగాల్ గడ్డపై నిశబ్దంగా పనిచేస్తున్న నిబద్ధత గల నేత మఖన్‌లాల్‌ సర్కార్‌. సువేందు అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మఖన్‌లాల్‌ను చూడగానే.. ప్రధాని మోదీ స్వయంగా ఆయన వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. సుదీర్ఘకాలం పార్టీ కోసం.. దేశం కోసం పోరాడిన యోధుడికి ప్రధాని ఇచ్చిన గౌరవం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News