PM Modi: తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్‌కు ప్రధాని మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆదివారం చెన్నైలో జరిగిన అట్టహాసమైన వేడుకలో విజయ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.”తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్‌కి అభినందనలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం.. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది” అని ప్రధాని పేర్కొన్నారు.
సంచలన విజయంతో అధికార పీఠం: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలన విజయం సాధించింది. మొత్తం 234 స్థానాలకు గాను 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ వంటి మిత్రపక్షాల మద్దతుతో విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ విజయ్ విజయం సాధించడం గమనార్హం.
Also read-Tamil Nadu: 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై సీఎం విజయ్ తొలి సంతకం

