Bhogapuram Airport: విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనం ప్రారంభమైంది. ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
అత్యాధునిక హంగులతో టెర్మినల్: ఈ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు నూతన టెర్మినల్ భవనంలో కలియతిరుగుతూ అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన టెర్మినల్ ప్రత్యేకతలు, ప్రయాణికులకు అందించే సేవలు మరియు ఎయిర్‌పోర్ట్ విశేషాలను జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ ప్రధానికి వివరించారు.

