HomeTop StoriesPM Modi: నా కాన్వాయ్‌ సైజ్‌ను సగానికి తగ్గించండి.. ఎస్‌పీజీకి మోదీ కీలక ఆదేశాలు!

PM Modi: నా కాన్వాయ్‌ సైజ్‌ను సగానికి తగ్గించండి.. ఎస్‌పీజీకి మోదీ కీలక ఆదేశాలు!

Prime Minister Convoy: ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌ సభలో పొదుపుపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ.. స్వయంగా తానే పాటించేందుకు సిద్ధమయ్యారు. తన కాన్వాయ్‌ సైజ్‌ను తగ్గించాలని ఎస్‌పీజీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

- Advertisement -

ప్రత్యేక రక్షణ దళానికి పీఎంఓ ఆదేశాలు: పొదుపు మంత్రం పాటించాలని దేశ ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా తానే పొదుపును పాటించేందుకు సిద్ధమయ్యారు. తన కాన్వాయ్‌ను సగానికి తగ్గించాలని మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తప్పనిసరి భద్రతా నిబంధనలకు ఎటువంటి భంగం కలగకుండా చూసుకోవాలని ప్రత్యేక రక్షణ దళానికి పీఎంఓ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎస్‌పీజీ ఇప్పటికే ఈ ఆదేశాలను అమలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు.

Also read-Tamil Nadu: నేడు విజయ్ సర్కార్‌కు అసెంబ్లీలో బలపరీక్ష.. నల్లేరు మీద నడకే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News