Saturday, March 14, 2026
HomeTop StoriesPM Modi: గర్భాశయ క్యాన్సర్ రహిత దిశగా భారత్‌.. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన మోదీ

PM Modi: గర్భాశయ క్యాన్సర్ రహిత దిశగా భారత్‌.. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన మోదీ

HPV vaccination: దేశంలోని మహిళల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) ముప్పు నుంచి యువతులను రక్షించేందుకు ఉద్దేశించిన హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈరోజు అధికారికంగా ప్రారంభించారు.

- Advertisement -

ఏటా 1.15 కోట్ల మంది బాలికలకు రక్షణ: ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు ప్రతి సంవత్సరం ఉచితంగా టీకాలు అందించాలని మోదీ సర్కార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్‌లో ఎంతో ఖరీదైన ఈ వ్యాక్సిన్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ టీకాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక దశలో 14 ఏళ్ల వయస్సు గల బాలికలందరికీ ఈ టీకా అందిస్తారు.

Also read-Kejriwal: ‘ఆప్‌ను నాశనం చేసేందుకు మోదీ, షా కుట్ర.. దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి’

హెచ్‌పీవీ ప్రయోజనం: గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో ప్రాణాంతకంగా మారుతున్న తరుణంలో.. చిన్న వయస్సులోనే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును సమర్థవంతంగా నివారించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మహిళా సాధికారత, ఆరోగ్య భారత్ లక్ష్యంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం దేశ ఆరోగ్య రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News