HomeTop StoriesPOCO C85 5G: అదిరిపోయే ఫీచర్స్‌ తో మీ బడ్జెట్‌ లోనే బెస్ట్‌ ఫోన్‌

POCO C85 5G: అదిరిపోయే ఫీచర్స్‌ తో మీ బడ్జెట్‌ లోనే బెస్ట్‌ ఫోన్‌

POCO C85 5G: తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి POCO C85 5G ప్రస్తుతం అందుబాటులో ఉంది. గత మార్చిలో విడుదలైన ఈ మోడల్ ఇప్పటికీ ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయమవుతోంది. ప్రారంభ సమయంలో రూ.10,999 ధరతో వచ్చిన ఫోన్ ప్రస్తుతం రూ.10 వేల పరిధిలో లభిస్తోంది. ఇందులో 5G కనెక్టివిటీతో పాటు 6300mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

- Advertisement -

POCO C85 5G రెండు స్టోరేజ్ ఎంపికల్లో వస్తుంది. 4GB RAMతో 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 కాగా, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

ఫోన్‌లో 6.9 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 720×1600 పిక్సెల్స్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz వరకు ఉంటుంది. 6300mAh బ్యాటరీతో పాటు 15W వైర్డ్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ పనిచేస్తుందని సమాచారం.

కెమెరాల విషయానికి వస్తే 32MP ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Unisoc T8300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌కు IP52 రేటింగ్, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB Type C పోర్ట్ ఉన్నాయి. ఫోన్ బరువు 210 గ్రాములు.

Also Read:Congress: కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా.. జయప్రదం చేయాలని పిలుపు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News