Saturday, March 14, 2026
HomeTop StoriesPoco X8 Pro series: వంద వాట్ల ఛార్జింగ్.. ఆరు వేల బ్యాటరీ.. బాంబులా పేలుతుందా...

Poco X8 Pro series: వంద వాట్ల ఛార్జింగ్.. ఆరు వేల బ్యాటరీ.. బాంబులా పేలుతుందా ఏంటి ఈ పోకో?

Poco X8 Pro series: పోకో నుంచి మరో మిడ్ రేంజ్ ఫోన్ సిరీస్ గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తాజా సమాచారం చెబుతోంది. యూఏఈకు చెందిన Telecommunications and Digital Government Regulatory Authority డేటాబేస్‌లో పోకో ఎక్స్8 ప్రో, పోకో ఎక్స్8 ప్రో మాక్స్ పేర్లు కనిపించడం లాంచ్ సమయం దగ్గరలోనే ఉందనే సంకేతంగా భావిస్తున్నారు. 2511FPC34G, 2602BPC18G అనే మోడల్ నంబర్లు నమోదు కావడం జరిగింది. స్పెసిఫికేషన్స్ వెల్లడికాకపోయినా, ఇలాంటి సర్టిఫికేషన్ సాధారణంగా అధికారిక ప్రకటనకు ముందు వచ్చే ముఖ్య దశగా గుర్తిస్తారు.

- Advertisement -

రీబ్రాండ్ స్ట్రాటజీనా?

ఈ కొత్త సిరీస్ చైనాలో ఇప్పటికే విడుదలైన Redmi Turbo 5, Redmi Turbo 5 Pro Max ఫోన్లకు గ్లోబల్ వెర్షన్‌గా రావొచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే డిజైన్, దాదాపు సమాన హార్డ్‌వేర్‌తో కొత్త పేరుతో ఎంట్రీ ఇవ్వడం పోకోకు కొత్త విషయం కాదు. అందువల్ల స్పెక్స్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని అంచనా.

డిజైన్‌లో అప్‌డేటెడ్ లుక్

పోకో ఎక్స్8 ప్రో డిజైన్ పరంగా మ్యాట్ ఫినిష్‌తో ఫ్లాట్ రియర్ ప్యానెల్ కలిగి ఉంటుంది. ఎడ్జెస్ స్వల్పంగా కర్వ్ అయినట్టు కనిపిస్తున్నాయి. టాప్ లెఫ్ట్ భాగంలో వర్టికల్ పిల్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉండగా, రెండు వేర్వేరు లెన్స్ రింగ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్లాక్, వైట్, టర్కాయిస్ కలర్ ఆప్షన్లు లీక్ చిత్రాల్లో దర్శనమిచ్చాయి. ముందుభాగంలో స్లిమ్ బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే, సెంటర్ హోల్ పంచ్ డిజైన్ ఉంటుందని సమాచారం. పవర్ బటన్ ఆరెంజ్ హైలైట్‌తో ఉండటం మొత్తం ఫోన్‌కు అప్‌డేటెడ్ లుక్ ఇస్తోంది.

ప్రో మాక్స్‌లో చిన్న మార్పులు

పోకో ఎక్స్8 ప్రో మాక్స్ డిజైన్ ప్రధానంగా ప్రో మోడల్‌లానే ఉన్నా, కెమెరా రింగ్స్ కొంచెం పెద్దగా ఉండటం గమనించదగ్గ అంశం. ఇది మెరుగైన కెమెరా హార్డ్‌వేర్ ఉండే సూచనగా భావిస్తున్నారు. అదే మూడు కలర్ షేడ్స్ ఇందులో కూడా అందుబాటులోకి రావొచ్చని సమాచారం.

డిస్‌ప్లే హైలైట్స్

పోకో ఎక్స్8 ప్రోలో 6.59 ఇంచుల 1.5K TCL M10 OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ HBM బ్రైట్నెస్, 3840Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. అవుట్‌డోర్ వినియోగంలో మంచి విజిబిలిటీ, కంటి అలసట తగ్గించే అనుభవం ఇవ్వగల డిస్‌ప్లేగా ఇది ఉండొచ్చు.

పర్‌ఫార్మెన్స్ సెగ్మెంట్

ఈ ఫోన్‌లో MediaTek Dimensity 8500 Ultra చిప్‌సెట్ ఉండొచ్చని సమాచారం. డైలీ యూజ్, గేమింగ్, మల్టీటాస్కింగ్ సమయంలో తగినంత స్పీడ్ అందించగల సామర్థ్యం ఉంటుందని అంచనా. మిడ్ రేంజ్ యూజర్లకు పర్‌ఫార్మెన్స్, పవర్ వినియోగం మధ్య మంచి బ్యాలెన్స్ ఇవ్వగల ప్రాసెసర్‌గా ఇది నిలవొచ్చు.

Read Also: Realme Narzo Power 5G: రియల్‌మీ నార్జో పవర్ 5G లాంచ్ డేట్ ఫిక్స్.. 10001mAh బ్యాటరీతో భారీ ఎంట్రీ

కెమెరా సెటప్ వివరాలు

పోకో ఎక్స్8 ప్రో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ Sony IMX882 ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుందని సమాచారం. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండొచ్చు. డైలీ ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా షేరింగ్‌కు సరిపడే సెటప్‌గా ఇది కనిపిస్తోంది.

భారీ బ్యాటరీ ఆకర్షణ

ఈ మోడల్‌లో 6500mAh బ్యాటరీ ఉండొచ్చని టాక్. 100W వైర్డ్ చార్జింగ్, 27W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఫుల్ చార్జ్ అయ్యే సామర్థ్యంతో పాటు, ఒక రోజు కంటే ఎక్కువ బ్యాకప్ ఇచ్చే అవకాశముంది.

ప్రో మాక్స్‌లో మరింత పవర్

పోకో ఎక్స్8 ప్రో మాక్స్‌లో 6.83 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే ఉండొచ్చు. పర్‌ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 9500s చిప్‌సెట్ ఉపయోగించే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. కెమెరా విషయంలో 50 మెగాపిక్సెల్ Light Hunter 600 సెన్సార్ OIS సపోర్ట్‌తో రావొచ్చు. 8500mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఈ మోడల్‌కు ప్రధాన హైలైట్ అవుతాయని భావిస్తున్నారు.

ఇండియా అంచనా ధర

ఇండియా మార్కెట్‌లో పోకో ఎక్స్8 ప్రో ప్రారంభ ధర సుమారు రూ. 27,999 నుంచి రూ. 29,999 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా. 12GB వేరియంట్ ధర రూ. 31,999 వరకు వెళ్లవచ్చు. పోకో ఎక్స్8 ప్రో మాక్స్ ధర సుమారు రూ. 32,999 నుంచి రూ. 35,999 మధ్య ఉండే అవకాశం ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 37,999 వరకు చేరవచ్చని మార్కెట్ అంచనాలు చెబుతున్నాయి. ఇవి అధికారిక ధరలు కావు, లీకుల ఆధారంగా చెప్పిన వివరాలు మాత్రమే.

అధికారిక లాంచ్

మొత్తానికి పోకో ఎక్స్8 ప్రో సిరీస్ భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ చిప్‌సెట్ కలయికతో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉన్నట్టు కనిపిస్తోంది. అధికారిక లాంచ్ తర్వాతే పూర్తి స్పష్టత రానున్నా, ఇప్పటివరకు వచ్చిన లీకులు ఈ సిరీస్‌పై అంచనాలను పెంచుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News